మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Panchakshara Mantra Garbha Stotram – పంచాక్షరమంత్రగర్భ స్తోత్రం
దుష్టతమోఽపి దయారహితోఽపి
విధర్మవిశేషకృతిప్రథితోఽపి |
దుర్జనసంగరతోఽప్యవరోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 1 ||
లోభరతోఽప్యభిమానయుతోఽపి
పరహితకారణకృత్యకరోఽపి |
క్రోధపరోఽప్యవివేకహతోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 2 ||
కామమయోఽపి గతాశ్రయణోఽపి
పరాశ్రయగాశయచంచలితోఽపి |
వైషయికాదరసంవలితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 3 ||
ఉత్తమధైర్యవిభిన్నతరోఽపి
నిజోదరపోషణహేతుపరోఽపి |
స్వీకృతమత్సరమోహమదోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 4 ||
భక్తిపథాదరమాత్రకృతోఽపి
వ్యర్థవిరుద్ధకృతిప్రసృతోఽపి |
త్వత్పదసన్ముఖతాపతితోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 5 ||
సంసృతిగేహకళత్రరతోఽపి
వ్యర్థధనార్జనఖేదసహోఽపి |
ఉన్మదమానససంశ్రయణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 6 ||
కృష్ణపథేతరధర్మరతోఽపి
స్వస్థితవిస్మృతిసద్ధృదయోఽపి |
దుర్జనదుర్వచనాదరణోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 7 ||
వల్లభవంశజనుః సబలోఽపి
స్వప్రభుపాదసరోజఫలోఽపి |
లౌకికవైదికధర్మఖలోఽపి
కృష్ణ తవాఽస్మి న చాఽస్మి పరస్య || 8 ||
పంచాక్షరమహామంత్రగర్భితస్తోత్రపాఠతః |
శ్రీమదాచార్యదాసానాం తదీయత్వం భవేద్ధ్రువమ్ || 9 ||
ఇతి శ్రీహరిదాస కృతం పంచాక్షరమంత్రగర్భ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.